జోహారులు Raju Kamble గారి కి

ప్రవాస భారత దేశంలో ఉన్న దళిత బహుజన అణగారిన వర్గం వారి గొంతుక ఈ రోజు మూగబోయింది అందుకోలేనంత దూరం శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశ నలుమూలలా అంబెడ్కర్ ఫూలే సిద్దాంతాలను వ్యాపింపజేసి మా అందరికి ఒక నాయకుడిగా మార్గదర్శిగా ముందుండి నడిపించిన మహాను భావుడు. స్వదేశం లో ఎక్కడ దళితుల హక్కుల పై దాడి జరిగిన తానూ ఈదేశంలో ఉన్నా అక్కడ నుంచే వాటిని ఖండిస్తూ దోషులను శిక్షించాలని ఎన్నో పోరాటాలు గల్ఫ్ దేశం లోను అమెరికా కెనడా మరియు సింగపూర్ జపాన్ లో ఉన్న దళిత బహుజనులను ఏకంచేసిన పోరాట ఏదుడు.

ఒక అగ్రకులానికి చెందిన మేధావి చెప్పిన విషయాన్నే ఒక దళిత కులానికి చెందిన మేధావి చెబితే వెలివేశారు. మమ్మల్ని వేలువేయడం తేలికదా ఎలాగూ వెలివాడలో కి తరతరాలుగా నెట్టబడి అక్కడే బ్రతికిన వారము అనుకున్నారో ఏమో, అందుకే తన వాదన చెప్పకముందే న్యాయస్థానం తీర్పు చెప్పకముందే వెలివేశారు. మను దర్మం పాటించే కొంత మంది రెడ్లు దొరలూ నాయుడు పాలించే కాలంలో ఇంకేమి ఆశిద్దాము. కొంత మంది మతవాదులు రాజకీయ నాయకులనబడేవారు మరికొంత మంది సినిమా వారు, మరియు ఆ నంద ఈ నంద ఆ స్వామి ఈ స్వామి లాంటి వారు మీడియా ద్వారా బెదిరింపులు చేసి దౌర్జన్యంగా దాడి చేయమని రెచ్చగొట్టిన వారికి చట్టాలు వర్తించవు. ఇంకా దారుణం మేధావితనం నిలబెట్టుకోవడానికి తాపత్రయ పడే మహా మేధావుల విశ్లేషణలు దుర్మార్గం ఏ ఏ యుగాలలో ఏమి ధర్మమమొ నొక్కి మరి సమర్థిస్తారు. ద్వాపర యుగంలో ఏది ధర్మము, త్రేతాయుగంలో ఏది రాజనీతి అని విశ్లేషణ చేసి చేసిన హత్యలను అవమానాల్ని సమర్థిస్తారు. కానీ అన్ని యుగాలలో, కాలంలో బడుగు బలహీన వర్గ ప్రజల పైనే దాడులు. మానవ హక్కులు అప్పుడు ఇప్పుడు ఒక్కటేనని ఈ మహా మేధావులకు తెలియదు పాపం.

తెలుగు న్యూస్ ఛానల్ T .V 9 రవిప్రకాష్ గారికి ముందుగా శుభాకాంక్షలు, తెలుగు న్యూస్ చరిత్రలో ఒక నూతన ఒరవడి సృష్టించినందుకు. ఇప్పటివరకు సమాజంలో చూపని చర్చించని విషయాలు వెలికి తీసి ప్రజలకు తెలియజేసారు. నేను హైదరాబాదు లో చదువుకొనే రోజుల్లో ఎవరైనా ఎక్కడైనా లంచాలు అడిగితె T .V 9 పేరుచెబితే భయపడే వారు. ఏదైనా తప్పుచేస్తే ముందు చెప్పేది పోలీసులుకు కాదు T V 9 మాత్రమే, అంతగా ప్రజలను బ్రభావితం చేశారు. కానీ ఇప్పుడున్న అంతర్జాలం లో సాంఘీక మాధ్యమాలు మరియు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన T .V ఛానల్ ఒత్తిడిని తట్టుకోలేక మీరు కూడా సాంప్రదాయ మీడియా లాగ పాత పద్ధతులు అవలంభిస్తున్నారని అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తా జులై 1 తారీఖున మీ ఛానల్ ద్వారా కత్తి మహేష్ గారు ఒకానొక సందర్భం లో తను వ్యక్తం చేసిన అభిప్రాయం పై చర్చ ను చూసాను. మరొక సారి శుభాకాంక్షలు ఇన్నాళ్లు వార్తను వార్తలాగే చూపించి అది సమాజానికి మేలో చెడు తీర్పు ఇచ్చే భాద్యత వీక్షకులకు ఇచ్చేవారు. అలాంటి మంచి ఛానల్ ఇప్పుడు తీర్పు కూడా మీరే నిర్ణయించి మా పైన రుద్దినట్లు అనిపిస్తుంది. ముందుగా నా గురించి నాలుగు మాటలు నేను ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం ప్రకారం హిందువుగా పుట్టాను కానీ నన్ను మల లేదా ఆది ద్రావిడ అంటారు. మా తాత ముత్తాతలు అంతెందుకు మా నాన్నగారు కూడా చదువుకోలేదు.ఎందుకంటే వాళ్ళు పుట్టిన మతం వారిని పాఠశాల కట్టడానికి మట్టి, ఇటుకుకలు మరియు రాళ్లు మోసే కూలీగా అర్హులు కానీ కట్టిన పాఠశాలలో చదుకోడానికి అనర్హులుగా పరిగణించింది. అంటే నేను పాఠశాల మెట్లు ఎక్కిన మొదటి తరం, నా తల్లిదండ్రులు తాత ముత్తాతలు పురాణాలు, వేదాలు చదవలేదు సరికదా విందామంటే కూడా చెవిలో సీసం పోశారు, అందుకే నాకు చిన్నపటినుంచి వేదం పురాణాలు వినే అవకాశం రాలేదు ఎవరు చెప్పలేదు.నేను పైచదువులు కొరకు పట్టణాలలో ఉన్నప్పుడు లైబ్రరీ లో వీటిని చదివాను. నాకున్న పరిజ్ఞానంతో రామాయణం లో కొన్ని సంఘటనలు శంభూకుని విషయం, సీతమ్మ తల్లి కి జరిగిన అన్యాయం ఇలాంటివి కొన్ని. ఇదే విషయాన్ని చెబితే మీ ఛానల్ లో చర్చను నడిపిన జర్నలిస్ట్ ఇరు వాదనలకు సమాపాలంలో సమయం ఇవ్వలేదుకదా,తన కూడా మా బహుజన దళిత సోదరులమీద ఎదురు దాడి చేసినట్లు నాకనిపించింది. ప్రతిసారి కోట్లమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఉటంకించారు బహుశా ఆ కోట్ల జనాభాలో మా అణగారిన దళిత బహుజనులను లెక్కలోకి తీసుకున్నారో లేదో నాకు తెలియదు ఒకవేళ అందులో నన్నుకూడా వారు పరిగణలోకి తీసుకొంటే. రామాయణం లేదా పురాణాల పైన కత్తి మహేష్ గారు వ్యక్త పరిచిన అభిప్రాయం నా మనోభావాలను దెబ్బతియ్యలేదు. అది మహేష్ గారి అభిప్రాయం మాత్రమే. ఇక తీర్పునిచ్చిన జర్నలిస్ట్ గారు పాపం మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చిన హిందూ వాదులకంటే ఆవిడ ఊగిపోయారు. మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన వారిపై ఎదురు దాడి చేశారు అంతేగాక మతవాదులను ఉసిగొలిపి మరి మాటల దాడి చేయించారు. మొదట మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన వారు చెప్పిన వాటిని వక్రీకరించి కులం పేరుతొ SC ST చట్టం పేరుతొ బెదిరిస్తున్నారు అని వాపోయారు జర్నలిస్ట్ గారు. కానీ మతవాదులు దౌజర్ణ్యంగా ఎదుటివారికి వారి వాదనలు చెప్పడానికి అవకాశం వచ్చిన ఆగకుండా మాటల దాడి చేస్తుంటే ఒక చర్చ నడిపే జర్నలిస్టుగా మతవాదులను ఆపకపోగా తను కూడా వారితో కలిసి మధ్యవర్తిగా వచ్చిన మీద నిందలు మోపినట్లు అనిపించింది. అంతటితో ఆగకుండా సదరు జర్నలిస్టు గారు కత్తి మహేష్ గారిని ఏఏ చట్టాలలో కేసు పెట్టవచ్చో సెక్షన్లతో సహా వళ్ళెవించింది. మహేష్ గారు మర్యాద పూర్వకంగా తను సమాధానం చెబుతున్నప్పటికీ మతవాదులు ఎదురు దాడి బెదిరింపులు చేస్తుంటే ఒక్కసారికూడా వారిని ఆపలేదు. నాకేమి అర్థమయిందంటే T V 9 చర్చ పేరుతొ దళితుల పట్ల దాడి చేసి ,దళితులనే దోషులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. ఈ చర్చ యూట్యూబ్ లో 1 గంట 9 నిమిషాల 45 సెకండ్స్ అందులో. 1 గంట 1 నిమిషాల 20 సెకండ్స్ సమయంలో ఆ జర్నలిస్ట్ పాత కాలం ల మా దళితులమీద దాడులు అవమానాలు జరగటం లేదని సర్టిఫికెట్ లేదా తీర్పు ఇచ్చేసారు. తన ఎదురుగానే కత్తి మహేష్ గారిని అనరాని మాటలని దుర్భాషలాడితే అది యాంకరమ్మకు తప్పుగా అవమానంగా అనిపించలేదు మహేష్ గారు పదే పదే అగ్రకుల అహంకార దాడిని యాంకర్ గారి కి చెబితే తను పట్టించుకోలేదు కదా సొంతంగా తీర్పే ఇచ్చేసారు. మళ్ళీ మహేష్ గారుఎలా మాట్లాడాలో కూడా యాంకరమ్మ హితబోధ చేశారు. టివి 9 లో ఎప్పటినుంచి తీర్పు ఇవ్వడం ప్రారంభించారో తెలియదు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే VHP వారు కూడా జర్నలిస్ట్ మతవాదులను ఎంతగా సపోర్ట్ చేసిందో కూడా చెబుతూ మెచ్చుకొన్నారు. ఆలా మతవాదులు జర్నలిస్టు పొగడగానే యాంకరమ్మ రాజ్యరంగా పరంగా వచ్చిన రిజర్వేషన్ పైన కూడా తెగ కామెంట్ చేసేసారు చివరకు కోట్లాది మంది మనోభావాలు ఎంతగా దెబ్బతిందో చెబుతూ సదరు జర్నలిస్టుగారు చర్చను మిగించారు.రవిప్రసాద్ గారు మీరు ఇంకా దళితులను అణగారిన వర్గాల వారిని పిలిపించి తిట్టిపిస్తే ఇంకా సత్కారాలు అవార్డులు కూడా రావొచ్చోనేమో! మొత్తం చర్చలో 90 శాతం మతవాదులు చర్చలో పాల్గొన్న దళితులను తిట్టడానికే శాపనార్థాలు పెట్టడానికే జర్నలిస్టు అవకాశమిచ్చినట్లుoది. తెలుగు న్యూస్ ఛానల్

Posted: July 2, 2018 in సమాజం

ఇందుమూలంగా యావన్మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏమనగా!

కూతలా దయాలన్ అనే నేను నా యొక్క అమూల్యమైన ఓటు హక్కును తెలుగు ప్రజలను నమ్మించి వంచించిన ఉత్తర భారతదేశ పార్టీ అయినా బా.జ. పా. ను ఓడించడానికి ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

అలాగే మీరుకూడా ఈ మాటకారి, మోసకారి, మాయదారి ఉత్తర భారతదేశ పార్టీ అయినా బా.జ. పా. ను ఓడించడానికి మీ కిష్టమైన పార్టీ అది తెలుగుదేశమా, యువజన శ్రామిక రైతు పార్టీనా లేదా జన సేనానా లేదా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీనా లేదా మరేదైనా పార్టీని ఎంచుకొని సపోర్ట్ చేయండి. మన ప్రాంతీయ పార్టీల సపోర్ట్ వీరికి అవసరం అయ్యేలా చెయ్యాలి. ఇప్పుడున్న పరిస్థిలో ఈఒక వేళ మన ప్రాంతీయ పార్టీలు మోసకారి ఉత్తర భారతదేశ పార్టీ అయినా బా.జ. పా. పొత్తు పెట్టుకొంటే అప్పుడుకూడా బా.జ. పా ను ఓడించి బుద్ధి చెప్పాలి.

ఏ బి యన్ ఆంద్రజ్యోతి రాధాకృష్ణ గారు
నా పేరు దయాలన్ నేను తానా సభలో మీరు నిర్వహించిన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాను, మీరు అందరు అడిగిన ప్రశ్నలకు మీదైన శైలిలో సమాదానాలు ఇచ్చారు. ఎందుకో నేను అడిగిన ప్రశ్నలకు దాటవేసి చూద్దాం అంటూ మరో వ్యక్తికీ అవకాసం ఇచ్చారు. తీరా టివి లో ప్రసారం చేసిన ఓపెన్ హార్ట్ లో నేను అడిగిన ప్రశ్నలను తీసివేసారు. అందుకే నేను అడిగిన ప్రశ్నను నా బ్లాగులో యదాతదంగా వ్రాస్తున్నాను. నమస్కారం రాధాకృష్ణ గారు, నా పేరు దయాలన్ నెను దళితుడుని , ఇక్కడ ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను మీ ప్రోగ్రామ్స్ రేగులరగా చూస్తాను, మీరు చల్ల చక్కగా సూటిగా ప్రశ్నలు అడుగుతారు. తెలంగాణ ఉధ్యమం వలన రెండు మంచి జరిగాయి ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం, లేకపోతె రోజు ఒకరినొకరు తిట్టు కొంటు ఉండే వాళ్ళం. రెండవది తెలంగాణ లో ఎంతో మంది కవులు కళాకారులు తెరపైకి వచ్చారు, వారికి గుర్తింపు వచ్చింది. అలాగే సమైక్యాంద్ర ఉద్యమంలో కొంత మంది కవులు కళాకారు పాల్గొన్న వారికి అంతగా ప్రోత్సాహం లభించలేదు. ఇప్పుడు క్రొత్తగా ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లో గౌరవ ముక్యమంత్రి మంచిగా చేస్తున్న ఎక్కువగా సింగపూర్ మోడల్ అంటున్నారు. ప్రబుత్వ కార్యక్రమమలో ఎక్కువగ బాలీబాలీవుడ్ నృత్యాలు పాటలు ఉంటాయి కాని మన గ్రామ ల్లో పాడే పాటలు, నృత్యాలకు ప్రాదాన్యత ఇవ్వటం లేదు అది చూసినప్పుడల్లా గుండెలో ఎక్కడో భాద, ముక్యమంత్రి గారు ఒక్క సింగపూర్ మోడల్ కాకుండా విలేజ్ మోడల్ కూడా రెండూ కలిపి ఆంద్రప్రదేశ్ ను అభివృద్ది చేయాలి. దీనిపై మీడియా అభిప్రాయం ఏమిటి? ఇది నా ప్రశ్న దీనికి మీరు ఇచ్చిన జవాబు “చూద్దాం, ఆలోచిద్దాం అన్నారు”.
ఈ ప్రశ్న అడిగినప్పుడు సభలో అందరూ చప్పట్లు కొట్టారు, ఇందులో తప్పు ఏమిటో కొన్ని సరదాకు అడిగిన ప్రశ్నలు ఎలియన్స్ ఉన్నారా, మన రాష్ట్రాన్ని అమెరికాలో కలిపెద్దా మా లాంటి ప్రశ్నలను కూడా టెలికాష్ట్ చేశారు, కాని నేను అడిగిన ప్రశ్నలను మాత్రమే ఎడిట్ చేశారు.

ప్రేమ ఒక వేల మన ముందుకు వస్తే ఇప్పుడు ప్రేమ పేరిట జరుగుతున్న దాడులు, హత్యలు గురించి ఎలా ఆవేదన చెందుతుందో ఒక చిన్న మాట

పువ్వుతో పోల్చితే పూజిస్తావని పొంగి పోవడం తప్పా
పోటీ పడి పొడుస్తావని అనుకోక పోవడం తప్పా
ప్రాణము తొ పోలిస్తే ప్రేమిస్తావని నమ్మడం తప్పా
యాసిడ్ తొ కాలుస్తావని అనుకోక పోవడం తప్పా
గులాబిలిస్తే గుండెకు హత్తుకుంటావనుకోవడం తప్పా
బ్లేడుతో గొంతు కోస్తావనుకోక పోవడం తప్పా
అందంగా ఉన్నావంటే అనందపడడం తప్పా
అరచి అవమానపరుస్తావనుకోక పోవడం తప్పా
మట్లాడి వెంటపడితే మౌనంగ ముందుకు పోవడం తప్పా
మాటువేసి మరణ శిక్ష వేస్తావనుకోక పోవడం తప్పా

మనజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పటికి మనవెంటే ఉంటాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదట జరిగిన మంచి చెడు రెండూ జీవితాంతం గుర్తుండి పోతుంది. కొందరు మొదట కొన్న పెన్ను, కొందరు మొదట నడిపిన స్కూటరు లేదా కారు మరి కొందరు తొలిముద్దు, తొలిప్రేమ అనొచ్చు ఇంకా చెప్పుకొంటే ఎన్నో ఉంటాయి. ఈ మద్యన మన తెలు రాష్ట్రాలలో ప్రేమ పేరిట జరుగుతున్న, యాసిడ్ దాడులు, కత్తులతో, బ్లేడులతో దాడులు గురించి టి.వి ల్లో వార్తా చూసెటప్పుడు మరియు పేపర్లలో చదివేటప్పుడు చాలా భాద వేస్తుంది. అందుకే అసలు ప్రేమంటే ఏమిటి, నిజమైన ప్రేమ ఎం కోరుకొంటుంది, అని వ్రాయాలని నా ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంలోనే మొట్టమొదట 25 వసంతాలు జరుపుకొన్న నా తొలి ప్రేమ సందర్భంగ ఈ నెల మొత్తం సెలెబ్రేట్ చెయ్యాలని నిర్నయించాను.
దీనితో పాటు అప్పుడు అంటే 1990 సంవత్స్తరం లో నా తొలి ప్రేమ కోసం వ్రాసిన కవిత్వాన్ని బోనస్ గ ఇక్కడ పెడుతున్నాను.

మనసా నా ప్రేమకేం తెలుసు కులాలు వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు నా రంగు వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు నా స్తోమత వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు మతాలూ వేరని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

గుండెకేం తెలుసు గొలుసు లుంటాయిని
గుండెకేం తెలుసు గునపాలుంటాయిని
గుండెకేం తెలుసు గోడలున్నాయిని
గుండెకేం తెలుసు బాదలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

కను చూపుకేం తెలుసు అస్యహించు కొన్నారని
కను చూపుకేం తెలుసు హేలని చేస్తారని
కను చూపుకేం తెలుసు హద్దులుంటాయని
కను చూపుకేం తెలుసు ఆలలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

చేవులకేం తెలుసు అసత్యాలుంటాయని
చేవులకేం తెలుసు వెకిలి నవ్వులుంటాయని
చేవులకేం తెలుసు వెక్కిరిస్తారని
చేవులకేం తెలుసు వేరుచేస్తారని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

కాళ్ళకేం తెలుసు కాలముంటుందని
కాళ్ళకేం తెలుసు ముళ్ళులుంటాయని
కాళ్ళకేం తెలుసు నిప్పులుంటాయని
కాళ్ళకేం తెలుసు బండ్డలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

ambedkar
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్- సతార-1902
మెట్రికులేషన్-ఎలిఫిష్టన్ ఉన్నత పాటశాల, బొంబాయి.1907
హైయర్ సెకండరి-ఎలిఫిష్టన్ కాలేజి బొంబాయి.1909
బి.ఏ, ఎలిఫిష్టన్ కాలేజి, బొంబాయి విశ్వ విద్యాలయం 1912
ఎం.ఏ, కొలంబియా విశ్వ విద్యాలయం 1915
ఫి.ఎచ్.డి.,కొలంబియా విశ్వ విద్యాలయం 1917
బారిస్టర్ ఎట్ లా- గ్గ్రేస్ ఇన్ లండన్ 1920
ఎం యస్సి, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ 1921
డి.ఎస్సి, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ 1923
ఎల్.ఎల్.డి., కొలంబియా విశ్వ విద్యాలయం 1952
డాక్టర్ అఫ్ లిటరేచర్- ఉస్మానియా విశ్వ విద్యాలయం 1953

తెలుగు బ్లాగర్లు అందరికీ భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు బ్లాగర్లు అందరికీ ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు బ్లాగర్లు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు