ఏ బి యన్ ఆంద్రజ్యోతి రాధాకృష్ణ గారు
నా పేరు దయాలన్ నేను తానా సభలో మీరు నిర్వహించిన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాను, మీరు అందరు అడిగిన ప్రశ్నలకు మీదైన శైలిలో సమాదానాలు ఇచ్చారు. ఎందుకో నేను అడిగిన ప్రశ్నలకు దాటవేసి చూద్దాం అంటూ మరో వ్యక్తికీ అవకాసం ఇచ్చారు. తీరా టివి లో ప్రసారం చేసిన ఓపెన్ హార్ట్ లో నేను అడిగిన ప్రశ్నలను తీసివేసారు. అందుకే నేను అడిగిన ప్రశ్నను నా బ్లాగులో యదాతదంగా వ్రాస్తున్నాను. నమస్కారం రాధాకృష్ణ గారు, నా పేరు దయాలన్ నెను దళితుడుని , ఇక్కడ ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను మీ ప్రోగ్రామ్స్ రేగులరగా చూస్తాను, మీరు చల్ల చక్కగా సూటిగా ప్రశ్నలు అడుగుతారు. తెలంగాణ ఉధ్యమం వలన రెండు మంచి జరిగాయి ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం, లేకపోతె రోజు ఒకరినొకరు తిట్టు కొంటు ఉండే వాళ్ళం. రెండవది తెలంగాణ లో ఎంతో మంది కవులు కళాకారులు తెరపైకి వచ్చారు, వారికి గుర్తింపు వచ్చింది. అలాగే సమైక్యాంద్ర ఉద్యమంలో కొంత మంది కవులు కళాకారు పాల్గొన్న వారికి అంతగా ప్రోత్సాహం లభించలేదు. ఇప్పుడు క్రొత్తగా ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లో గౌరవ ముక్యమంత్రి మంచిగా చేస్తున్న ఎక్కువగా సింగపూర్ మోడల్ అంటున్నారు. ప్రబుత్వ కార్యక్రమమలో ఎక్కువగ బాలీబాలీవుడ్ నృత్యాలు పాటలు ఉంటాయి కాని మన గ్రామ ల్లో పాడే పాటలు, నృత్యాలకు ప్రాదాన్యత ఇవ్వటం లేదు అది చూసినప్పుడల్లా గుండెలో ఎక్కడో భాద, ముక్యమంత్రి గారు ఒక్క సింగపూర్ మోడల్ కాకుండా విలేజ్ మోడల్ కూడా రెండూ కలిపి ఆంద్రప్రదేశ్ ను అభివృద్ది చేయాలి. దీనిపై మీడియా అభిప్రాయం ఏమిటి? ఇది నా ప్రశ్న దీనికి మీరు ఇచ్చిన జవాబు “చూద్దాం, ఆలోచిద్దాం అన్నారు”.
ఈ ప్రశ్న అడిగినప్పుడు సభలో అందరూ చప్పట్లు కొట్టారు, ఇందులో తప్పు ఏమిటో కొన్ని సరదాకు అడిగిన ప్రశ్నలు ఎలియన్స్ ఉన్నారా, మన రాష్ట్రాన్ని అమెరికాలో కలిపెద్దా మా లాంటి ప్రశ్నలను కూడా టెలికాష్ట్ చేశారు, కాని నేను అడిగిన ప్రశ్నలను మాత్రమే ఎడిట్ చేశారు.

Advertisements

ప్రేమ ఒక వేల మన ముందుకు వస్తే ఇప్పుడు ప్రేమ పేరిట జరుగుతున్న దాడులు, హత్యలు గురించి ఎలా ఆవేదన చెందుతుందో ఒక చిన్న మాట

పువ్వుతో పోల్చితే పూజిస్తావని పొంగి పోవడం తప్పా
పోటీ పడి పొడుస్తావని అనుకోక పోవడం తప్పా
ప్రాణము తొ పోలిస్తే ప్రేమిస్తావని నమ్మడం తప్పా
యాసిడ్ తొ కాలుస్తావని అనుకోక పోవడం తప్పా
గులాబిలిస్తే గుండెకు హత్తుకుంటావనుకోవడం తప్పా
బ్లేడుతో గొంతు కోస్తావనుకోక పోవడం తప్పా
అందంగా ఉన్నావంటే అనందపడడం తప్పా
అరచి అవమానపరుస్తావనుకోక పోవడం తప్పా
మట్లాడి వెంటపడితే మౌనంగ ముందుకు పోవడం తప్పా
మాటువేసి మరణ శిక్ష వేస్తావనుకోక పోవడం తప్పా

మనజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పటికి మనవెంటే ఉంటాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదట జరిగిన మంచి చెడు రెండూ జీవితాంతం గుర్తుండి పోతుంది. కొందరు మొదట కొన్న పెన్ను, కొందరు మొదట నడిపిన స్కూటరు లేదా కారు మరి కొందరు తొలిముద్దు, తొలిప్రేమ అనొచ్చు ఇంకా చెప్పుకొంటే ఎన్నో ఉంటాయి. ఈ మద్యన మన తెలు రాష్ట్రాలలో ప్రేమ పేరిట జరుగుతున్న, యాసిడ్ దాడులు, కత్తులతో, బ్లేడులతో దాడులు గురించి టి.వి ల్లో వార్తా చూసెటప్పుడు మరియు పేపర్లలో చదివేటప్పుడు చాలా భాద వేస్తుంది. అందుకే అసలు ప్రేమంటే ఏమిటి, నిజమైన ప్రేమ ఎం కోరుకొంటుంది, అని వ్రాయాలని నా ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంలోనే మొట్టమొదట 25 వసంతాలు జరుపుకొన్న నా తొలి ప్రేమ సందర్భంగ ఈ నెల మొత్తం సెలెబ్రేట్ చెయ్యాలని నిర్నయించాను.
దీనితో పాటు అప్పుడు అంటే 1990 సంవత్స్తరం లో నా తొలి ప్రేమ కోసం వ్రాసిన కవిత్వాన్ని బోనస్ గ ఇక్కడ పెడుతున్నాను.

మనసా నా ప్రేమకేం తెలుసు కులాలు వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు నా రంగు వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు నా స్తోమత వేరని
మనసా నా ప్రేమకేం తెలుసు మతాలూ వేరని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

గుండెకేం తెలుసు గొలుసు లుంటాయిని
గుండెకేం తెలుసు గునపాలుంటాయిని
గుండెకేం తెలుసు గోడలున్నాయిని
గుండెకేం తెలుసు బాదలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

కను చూపుకేం తెలుసు అస్యహించు కొన్నారని
కను చూపుకేం తెలుసు హేలని చేస్తారని
కను చూపుకేం తెలుసు హద్దులుంటాయని
కను చూపుకేం తెలుసు ఆలలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

చేవులకేం తెలుసు అసత్యాలుంటాయని
చేవులకేం తెలుసు వెకిలి నవ్వులుంటాయని
చేవులకేం తెలుసు వెక్కిరిస్తారని
చేవులకేం తెలుసు వేరుచేస్తారని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

కాళ్ళకేం తెలుసు కాలముంటుందని
కాళ్ళకేం తెలుసు ముళ్ళులుంటాయని
కాళ్ళకేం తెలుసు నిప్పులుంటాయని
కాళ్ళకేం తెలుసు బండ్డలుంటాయని
నేను చూపిందల్లా స్వచ్చమైన ప్రేమే తప్పా ఆశించింది ఏమీ లేదు!

ambedkar
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్- సతార-1902
మెట్రికులేషన్-ఎలిఫిష్టన్ ఉన్నత పాటశాల, బొంబాయి.1907
హైయర్ సెకండరి-ఎలిఫిష్టన్ కాలేజి బొంబాయి.1909
బి.ఏ, ఎలిఫిష్టన్ కాలేజి, బొంబాయి విశ్వ విద్యాలయం 1912
ఎం.ఏ, కొలంబియా విశ్వ విద్యాలయం 1915
ఫి.ఎచ్.డి.,కొలంబియా విశ్వ విద్యాలయం 1917
బారిస్టర్ ఎట్ లా- గ్గ్రేస్ ఇన్ లండన్ 1920
ఎం యస్సి, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ 1921
డి.ఎస్సి, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ 1923
ఎల్.ఎల్.డి., కొలంబియా విశ్వ విద్యాలయం 1952
డాక్టర్ అఫ్ లిటరేచర్- ఉస్మానియా విశ్వ విద్యాలయం 1953

తెలుగు బ్లాగర్లు అందరికీ భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు బ్లాగర్లు అందరికీ ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు బ్లాగర్లు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Happy Christmas

Posted: December 24, 2014 in సమాజం

Dear Telugu blogers

Wish you all Happy Christmas

20141115_115701

20141115_11564120141115_11570120141115_13262120141115_112635మహారాస్త్రం లోని ఆహామద్నగర్ జిల్లాలో అక్టోబరు నెల20 న,ఒక దళిత కుటుంబాన్ని తల్లి, తండ్రి మరియు ముంబాయి లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న కొడుకును కిరాతకంగా, అత్యతంత హీనంగా కొంతమంది మనువాదులు రంపాలోతో 40 ముక్కలుగా కోసి చంపిన ఘటన పై నిరసన తెలియజేస్తూ, ఈ లాంటి కిరాతకానికి పాల్పడిన నరరూప రరాక్ససులను వెంటనే అరెస్టు చేయాలని, అలాగే హంతకులను రక్షిస్తున్నరాజకీయ వేత్తలను , ఈ రాజకీయ నాయకుల బజన చేసే అధికారులను తక్షణం విధులనుంచి తప్పించి, అరెస్టు చేయాలని కోరుతూ నవంబరు 15 తేదీన ఉత్తర అమెరికా అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ అంతర్జాతీయ మిషను వారు సంయుక్తంగా యునైటెడ్ నేషణ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రం నిర్వహించారు.

భాదితులైన జాధవ్ కుటుంభానికి న్యాయం జరిగేల భారత ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి అన్న డిమాండు తొ కూడిన వినతి పత్రాన్ని యునైటెడ్ నేషణ్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రం లో సుమారుగా 150 కుటుంబాలు క్రోవత్తులతొ ర్యాలీలో చలిని కూడా లెక్క చేయకుండా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిచిగాన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఒహిఒ, ఇండియాన మరియు కెనడా దేశం నుంఛి అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Dhamma ఉత్తర అమెరికా అంబేద్కర్ సంఘం తరపున 58 వ ధమ్మ చక్ర ప్రవర్తన ధినోత్సవం మిచిగాన్ రాష్ట్రంలోని స్తేర్లింగైట్ నగరంలో ఉన్న వాత్పాకం బుద్ధ మందధిరంలో అక్టోబరు 18న ఘనంగ జరిగింది. ప్రపంచ చరిత్రలో ఒక్కరోజులో కొన్ని వేల ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజులు రెండు, మొదటిది సామ్రాట్ అశోక బౌద్ధమతం స్వేకరించడం, రెండవది అశోక విజయదశిమి రోజున భారత రాజ్యంగా నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నాయకత్వం లో నాగపూర్ నగరం లో లక్షలాది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించడం.. ఈ కార్యక్రమానికి ముప్పై కుటుంభాలు పాల్గొన్నాయి, ఈ సంవత్సరం యువకులు, చిన్న పిల్లలు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ద చెప్పిన కొన్ని ముఖ్యమైన సూక్తులు, మనువాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సభలోనే మన భారత దేశంలోని ఆంద్రప్రదేశ్ లో జరిగిన హుదుద్ తుపాను భాధితుల సహాయం కోసం నిధులు సేకరించారు, ఇప్పటివరకు సేకరించిన మొత్తం Rs.70,000 ఉత్తర అమెరికా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజు చేరుకోండ గారి తద్వారా తుపాను భాదితులకు అందజేయాలని తీర్మానం చేశారు.

తెలుగు మీడియా కబుర్లు కాదు కాదు తెలంగాణ మీడియా కబుర్లు వారి జ్ఞాన . శూన్యానికి ఈ బ్లోగుపోస్ట్ పరాకాష్ట , ఈ బ్లాగును నడుపుతున్న మేతావులకు నా మాట. మన దేశం లో ఆతంకవాదులు 26/11 జరిపిన దాడి ని కొన్ని జాతీయ టి.వి. చానళ్ళు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపి పరోక్షంగా ఆతంకవాదులకు సహాయపడిన ఘటన దెశ ద్రోహానికి సమానం. అయిన మన భారత ప్రభుత్వం సదరు చానాల్లను నిషేదించలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం కాబట్టి, వారిని మందలించి మరో మారు ఇలాంటి పొరపాట్లు జరగ కుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాని ఈ మద్య న కొత్తగా కొలువు దీరిన శాసన సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రంలో కొన్నింటి మీద ఒక చానల్ అత్యుక్షహంగా వేసిన చవకబారు కార్యక్రమాన్ని అందరూ ఖండించాల్సిందే కాని నిషేదించడం దుర్మార్గం, దురహంకారం. అంతకంటే దుర్మార్గం మీడియా బాగు కొరకే బ్లాగులు నడుపుతున్నాం అని ప్రచారం చేసుకొంటున్న కొంతమది అతిమేదావులు ఈ చానళ్ళ నిషేదాన్ని ఖండించక పోవడం దురద్రుష్టకరం. ఒక వేల, రాజ్యాంగాన్నే గౌరవించని ముఖ్యమంత్రికి మన ఖండన ఏ మూలకు అనుకోన్నారో ఏమో ఈ మీడియా కబురులు మేతావులు చెప్పాలి. సమర్దించక పోతే పోతారూ వీరి భయాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజాదరణ పొందిన చాన్నల్లనే నిషేదించిన మహానుభావులకు వీరి బ్లాగును నిషేదించడం ఎంత పని. అందుకే ఈ బ్లాగు నిర్వాహకులు మొన్న ఓరుగల్లు లో జారీచేసిన ముక్యమంత్రి “సలాం” హుకం ప్రకారం ఈ బ్లాగు వారు నడుచుకొంటున్నారు. మన దేశానికి ఒక రాజ్యంగం ఉంది దాని ప్రకారం హక్కులున్నాయి అలాగే విధులు కూడా వీటిని ఎవరైనా తప్పుగా పాటిస్తే లేదా పొరపాట్లు చేస్తే భంగం
కలిగిస్తే ఎటువంటి శిక్షలు వేయాలో కూడా మనం చట్టాలు తయారు చేసుకొన్నాం అన్న విషయం తెలియలేదో లేదా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ నిషేధం పై ఏదో ఒకటి వ్రాస్తే పోలా అనుకోని ఈ పోస్టు వ్రాసారో ఏమో. మన దేశం లో నరమేధం జరిపిన కసబ్ ను కూడా మన చట్టం ప్రకారం వాదనలు ప్రతివాదనలు కు అవకాశం ఇచ్చి జైలులో ఉన్నంత కాలం బద్రత కోసం కోట్లు ఖర్చు పెట్టి చివరకి న్యాయవాది ఇచ్చిన తీర్పు ప్రకారమే ఉరితీసారు అలాంటి భారత దేశం లో చట్టం ఏమిచెప్పిన మాక్కరలేదు మేము ఎవరిని నిషెదించాలి, ఎవరికీ స్వేచ్చ ఇవ్వాలి అన్నది మేమే నిర్ణయించుకొంటాం అంటూ చాన్నాళ్ళ నిషేధం కొనసాగుతుంటే. ఈ బ్లాగర్లు చాన్నాళ్ళకు జలక్ అవసరం అయిన సమయంలో చట్టాల ప్రకారం సదరు చాన్నాళ్ళ పై చర్య కోసం డిమాండు చేయకపోగా నిషేదాన్ని సమర్దిస్తూ వింత వాదనులు వ్రాయడం మరీ విడ్డూరం.
చివరగ మరోమారు బ్లాగు మేధావులకు నా మాట మనకు రాజ్యంగం ఉంది చట్టాలు ఉన్నాయి అది మరిచి పోకండి.